ప్యాంట్ జిప్ తీయడం లైంగిక దాడి కాదు.. బాంబే హైకోర్టు మరో సంచలన తీర్పు!

162

ఈమధ్య కాలంలో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వడమే కాదు సంచలన వ్యాఖ్యలు కూడా చేస్తుంది. ఈ మధ్యనే బాంబే హైకోర్టు ఓ వేధింపుల కేసులో ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఓ 12 ఏళ్ల బాలికపై 39 ఏళ్ల వ్యక్తి వేధింపులకు పాల్పడినట్లుగా కేసు నమోదైందవగా కింది కోర్టు ఆ వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్షను కూడా ఖరారు చేసింది. అయితే.. హైకోర్టులో మాత్రం ఆ కేసును కొట్టేశారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి.. బాలిక వక్షస్థలాన్ని దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని సంచలన తీర్పు ఇచ్చింది.

నాగ్‌పుర్‌ బెంచ్‌కు చెందిన మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ పుష్ప గనేడివాలా ఇచ్చిన ఆ తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం కాగా న్యాయవర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఆ తీర్పే సంచలనం అనుకుంటే ఈరోజు మరో కొత్త సంచలన తీర్పు ఇచ్చారు. మైన‌ర్ బాలిక చేయి ప‌ట్టుకోవ‌డం, ప్యాంటు జిప్ తీయ‌డం ప్రొటెక్ష‌న్ ఆఫ్ చిల్డ్ర‌న్ ఫ్రం సెక్సువ‌ల్ అఫెన్సెస్ యాక్ట్ (పోక్సో) కింద లైంగిక దాడి కాద‌ని చెప్పింది. అది ఐపీసీ సెక్ష‌న్ 354 కింద లైంగిక వేధింపుల కిందికి మాత్రమే వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేసింది.

ఓ ఐదేళ్ల బాలిక‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన 50 ఏళ్ల వ్య‌క్తికి ట్రయ‌ల్ కోర్టు పోక్సో చ‌ట్టం సెక్ష‌న్ 10 కింద ఐదేళ్ల క‌ఠిన కారాగార శిక్ష‌, రూ.25 వేల జ‌రిమానా విధించింది. నిందితుడు హైకోర్టులో అప్పీల్ చేసుకోగా విచారించిన నాగపూర్ బెంచ్ న్యాయమూర్తి పుష్ప ఈ నేరం పోక్సో చట్టం కింద రాదని తేల్చి ఇప్పటికే నిందితుడు ఐదు నెలల శిక్ష అనుభవించిన కారణంగా ఆ శిక్ష సరిపోతుందని తీర్పు నిచ్చారు. దీంతో ఈ తీర్పుతో పాటు న్యాయమూర్తి పుష్ప తీర్పులు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.

ప్యాంట్ జిప్ తీయడం లైంగిక దాడి కాదు.. బాంబే హైకోర్టు మరో సంచలన తీర్పు!