డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా బుక్కైన జబర్ధస్త్ కమెడియన్!

409

jabardasth: ఓ ప్రముఖ తెలుగు ఛానెల్ లో ప్రసారమయ్యే జబర్ధస్త్ గురించి తెలుగు టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఈ కామెడీ షో చాలా వల్గారిటీగా ఉంటుందని తిట్టే వాళ్ళు ఉన్నా ఆదరణలో మాత్రం ఎప్పటికప్పుడు రికార్డులు దక్కించుకుంటూనే ఉంది. ఇక ఈ షో ద్వారా పదుల సంఖ్యలో కమెడియన్లు బుల్లితెరపై పరిచయమవగా కొందరు ఈ షో నుండి వెండితెర మీద కూడా వెలిగిపోతున్నారు. చాలా మంది ఆర్టిస్ట్‌లు ఈ షోతో జీవితంలో స్థిర‌పడి.. ఇల్లు, కారు కొనుక్కొని సంతోషంగా గడుపుతుంటే మరికొందరు మాత్రం అన‌వ‌స‌ర‌పు వివాదాల‌లో ఇరుక్కుంటున్నారు.

ఇప్పటికే కొందరు బాడీ మస్సాజ్, వ్యభిచారం కేసులో హోటల్ రైడ్ లో దొరికినవాళ్లు ఉండగా తాజాగా త‌న్మ‌య్ అనే క‌మెడీయ‌న్ శుక్రవారం అర్ధరాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అడ్డంగా దొరికి వార్త‌ల‌లో నిలిచాడు. జబర్ధస్త్ షోలో లేడీ గెటప్స్ తో కమెడియన్ గా రాణిస్తున్న తన్మయ్ మందు తాగి వాహనం నడుపుతున్నాడని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇత‌నితో పాటు కొంద‌రు ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్స్ ఉండ‌గా వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్టు తెలుస్తుంది.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా బుక్కైన జబర్ధస్త్ కమెడియన్!