మోడీకి షాక్ ఇచ్చిన యువరాజ్ సింగ్

117

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. శనివారానికి ఆందోళనలు 18 వ రోజుకు చేరుకున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం చట్టాల్లో పలు సవరణలు చేస్తామని చెప్పిన రైతులు వినడం లేదు, చట్టాలను రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే నేడు టోల్ గేట్స్ బంద్ కు పిలుపునిచ్చారు. ఇక మరోవైపు రైతులకు వివిధ పార్టీలు, ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తుంది. తాజాగా భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతు పలికాడు. అయితే రైతు నిరసనలపై తన తండ్రి యోగ్రాజ్ సింగ్ చేసిన ప్రసంగం పట్ల తాను బాధపడ్డానని తెలిపాడు.

అలాగే రైతులు, కేంద్ర ప్రభుత్వాల మధ్య కొనసాగుతున్న సంఘర్షణను త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నట్లు యువరాజ్ తెలిపారు. ఇక రైతులు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోని ఉద్యమం చెయ్యాలని తెలిపారు.

మోడీకి షాక్ ఇచ్చిన యువరాజ్ సింగ్