ఈనెల 20న ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం

132

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల.. తెలంగాణలో నూతన రాజకీయ పార్టీ పెడుతున్నట్టు సూత్రప్రాయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లాకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో ఆమె ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.. వారి సూచనలు, అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.

తెలంగాణలోని అన్ని జిల్లాల వైఎస్ఆర్ అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.. ఈ క్రమంలో ఈ నెల 20న ఉమ్మడి ఖమ్మం జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ తరువాత మరో వారం రోజులకు ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల అభిమానులతో ఆమె భేటీ అవుతారని షర్మిల సన్నిహిత వర్గాలు దృవీకరిస్తున్నాయి.