ఏపీలో మరో సంక్షేమ పథకం ప్రారంభం

74
ys-jagan-mohan-reddy-luanched-jagananna-jeeva-kranthi-scheme
ys-jagan-mohan-reddy-luanched-jagananna-jeeva-kranthi-scheme

ఏపీలో మరో సంక్షేమ పథకం ప్రారంభం అయింది.. మహిళలు తక్కువ పెట్టుబడితో ఆర్థికంగా నిలదొక్కుకొని వారి జీవన స్థాయి ప్రమాణాలను పెంచుకోవాలనే సంకల్పంతో ‘జగనన్న జీవ క్రాంతి’ పథకానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. గురువారం ఈ పథకం జగన్ చేతులమీదుగా లాంఛనంగా ప్రారంభం అయింది. ఇందులో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయస్సు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రభుత్వ ఆర్థిక సాయంతో రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు, మేకలను పంపిణీ చేస్తారు.

మొత్తం 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్లను పంపిణీ చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రూ.1868.63 కోట్లు వ్యయం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కాగా ఈ పథకాన్ని మూడు విడతలుగా అమలు చేయనున్నారు. మొదటి విడతలో 2021 మార్చి వరకు 20 వేల యూనిట్లు, రెండవ విడతలో 2021 ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు 1,30,000 యూనిట్లు, మూడవ విడతలో 2021 సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు 99,000 యూనిట్లు కలిపి మొత్తం 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్లను పంపిణి చేస్తారు.