సీఎం జగన్‌ చేత బర్త్‌ డే కేట్‌ కట్‌ చేయించిన సీఎస్‌, డీజీపీ

112

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌. జగన్‌మోహన్ రెడ్డి జన్మదినం సందర్బంగా క్యాంపు కార్యాలయంలో ఆయన చేత సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ కేక్ కట్ చేయించారు. అనంతరం సీఎంకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు ఇంచార్జ్ దేవినేని అవినాష్ తదితరులు హాజరయ్యారు.