రైలుపై సెల్ఫీ దిగుతు యువకుడు మృతి.. వీడియో

85

సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి ప్రాణం తీసింది. అంతే కాదు రైలుకు నిప్పు అంటుకునేలా చేసింది. ఈ ఘటన ఒడిశాలోని పర్లాఖెముండి రైల్వేస్టేషన్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. అప్పుడే స్టేషన్ లోకి వచ్చి నిలిచి ఉన్న రైలు వద్దకు ముగ్గురు యువకులు వెళ్లారు. అందులో ఒక యువకుడు రైలు పైకెక్కి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు..

పక్కనే ఉన్న తీగలను గమనించకుండా చెయ్యి పైకి లేపాడు. పైన ఉన్న విద్యుతు తీగలు తగలడంతో అక్కడిక్కకడే మృతి చెందాడు. నిప్పురవ్వలు ఎగసిపడి రైలు బోగీలపై పడ్డాయి. దింతో భోగిలకు నిప్పు అంటుకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను నియంత్రించారు. మృతుని వివరాలు తెలియరాలేదు.

ఎన్ని బోగీలు దగ్దమయ్యాయి, ఎంత నష్టం జరిగి ఉంటుంది అనే దానిపై విచారణ చేస్తున్నారు అధికారులు.

రైలుపై సెల్ఫీ దిగుతు యువకుడు మృతి