కొత్త కారు కొన్న యువనటుడు

158

యువ హీరో నిఖిల్ సిద్దార్థ్ కొత్తకారు కొన్నారు. తాను నటించిన సినిమా విజయవంతం కావడంతో తనకు తానే బహుమతి ఇచ్చుకున్నానని నిఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను కొన్న రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఆటోబయోగ్రఫీ కారుతోపాటు దిగిన ఫోటోలను జతచేశారు యువ హీరో. ఈ కారు విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుంది. హ్యాపీడేస్ సినిమాతో తెరంగేట్రం చేసిన నిఖిల్ ఆ తర్వాత హీరోగా ఆరేడు సినిమాలు చేశారు. స్వామి రారా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్నాడు.

ఇక గతేడాది కరోనా టైంలో ప్రేయసితో నిఖిల్ వివాహం జరిగింది. 2020 లో విడుదలైన ‘అర్జున్‌ సురవరం’ సినిమా విజయం సాధించడంతో ఈ కారు కొన్నట్లు నిఖిల్ తెలిపారు. కాగా ప్రస్తుతం ప్ర‌స్తుతం వైవాహిక జీవితం ఎంజాయ్ చేస్తున్నాడు నిఖిల్. ఇక సినిమాల పరంగా చూస్తే నిఖిల్‌ కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ- 2, గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ‘18 పేజెస్’ అనే సినిమాలు చేస్తున్నాడు. కరోనా వలన కారు కొనడం ఆలస్యమైందని తెలిపారు నిఖిల్

కొత్త కారు కొన్న యువనటుడు

 

View this post on Instagram

 

A post shared by Nikhil Siddhartha (@actor_nikhil)