మొన్న ఎన్టీఆర్.. నేడు పవన్.. ఆగని లీకులు!

151

తెలుగు సినిమాకు లీకుల బెడ‌ద చాలా ఎక్కువైంది. సినిమా సెట్స్ పై ఉండ‌గా, కొన్ని ఫొటోలు బ‌య‌ట‌కు వ‌స్తుంటే, మరి కొన్ని ఎడిటింగ్ స‌మ‌యంలో లీక్ అవుతున్నాయి. దీనిపై ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు. ఈ మధ్యనే తెలుగు క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ కు సంబంధించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ బెంగాల్ పులితో పోరాటానికి సంబంధించిన క్యూరియస్ ఫోటో లీకైపోవడం కలకలం రేపింది. అంతేకాదు రామ్ చరణ్ బ్రిటిష్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించిన ఫోటోలతో పాటు ఎన్టీఆర్ హీరోయిన్ తో ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.

ఇక ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- రానా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్‌కు సంబంధించిన ఫొటో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. మాతృకలో పృథ్వీరాజ్ – బిజు మీనన్ లాంటి స్టార్లు పోషించిన పాత్రల్లోనే పవన్ – రానా నటిస్తున్నారు. సాగ‌ర్ కె చంద్ర తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ మాట‌లు అందిస్తున్నారు. హైద‌రాబాద్ శివార్ల‌లో వేసిన సెట్‌లో మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుండ‌గా, సెట్ నుండి ఫొటో లీకైంది. ఇందులో ప‌వ‌న్ వెనుక పోలీసులు లాఠీలు ప‌ట్టుకొని క‌నిపిస్తున్నారు.

ఈ ఫొటో అభిమానుల‌లో సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తుంది. శివ‌రాత్రి సంద‌ర్భంగా మూవీ నుండి సర్‌ప్రైజ్ రానుంద‌ని తెలుస్తుంది. గతంలో అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ కాకుండనే పూర్తి సినిమానే ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. ఆ దెబ్బకి సినిమాను ముందే విడుదల చేస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలా పవన్ కొత్త సినిమా ఫోటో లీక్ అయింది.

మొన్న ఎన్టీఆర్.. నేడు పవన్.. ఆగని లీకులు!