‘జగనన్న రక్తదోపిడి’ పథకం.. ప్రభుత్వంపై సొంతపార్టీ ఎంపీ సెటైర్లు..

124

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు.. నర్సాపురం ఎంపీ రఘరామకృష్ణం రాజు.. వైఎస్ఆర్ పార్టీపై వీలు చిక్కినప్పుడల్లా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లెక్కేంటో అసలు అర్థం కావట్లేదు.. స్వపక్షంలో విభీషనుడిలా తయారైంది రఘురామ వ్యవహారం.. లేటెస్ట‌గా ఎంపీ రఘరామకృష్ణం రాజు మరోసారి రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంపై, తన ప్రభుత్వం తప్పులు చేస్తుందంటూ ఆరోపిస్తూ.. విమర్శలు చేశారు.

రాష్ట్రంలో రంగులు వ్యవహారంపై ఇప్పటికే జగన్ ప్రభుత్వానికి పలుమార్లు మొట్టికాయలు పడగా.. మరోసారి మా పార్టీ రంగులు.. మహిళా పోలీసు వాహనాలకు వేయడం తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందంటూ చెప్పుకొచ్చారు. ఎవరి అడుగులకు మడుగులు ఒత్తాలని పోలీసులు.. మా పార్టీ రంగులు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రంగులు బండ్లకు వేశారంటూ ప్రశ్నించారు. లాజిక్ మిస్ అయ్యి.. సంబంధిత అధికారులు.. మూడు రంగులు వెయ్యడం అనేది తప్పు అని అభిప్రాయపడ్డారు.

గతంలో కూడా మా ప్రభుత్వం ఇటువంటి తప్పులే చేసిందని, సుప్రీంకోర్టు వరకు వెళ్లి, చెంపదెబ్బలు తిన్నా కూడా.. ఇంకా మా ప్రభుత్వానికి బుద్ధి వచ్చినట్లు లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గృహాలకు కూడా రంగులు మార్చే దుస్సాహసం చేసిందని.. అత్యుత్సాహం.. ప్రభుత్వ అధికారులు ప్రదర్శించడం కరెక్ట్ కాదని అన్నారు. ఈ కారణంగా మా పార్టీ పరువు గంగలో కలిసిపోతుంది.. మా పార్టీ అధ్యక్షుడి పరువు గంగలో కలిసిపోతుందని అన్నారు.

ఏదైనా సరే.. ఇటువంటి పనులు వల్ల ప్రభుత్వానికి మచ్చ అని, రంగుపడుద్ది అని హెచ్చరించారు. ప్రజల డబ్బులను ఇంతలా వృధా చెయ్యాలా? అని ప్రశ్నించారు. మా ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి పనులను బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇలా ప్రతీదానికి రంగులు వెయ్యడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, ఇప్పటివరకు రంగులకు నాలుగు వేల కోట్లు అయ్యిందని అంటున్నారని, అంతకాకపోయినా.. ఓ వెయ్యి కోట్లు అయ్యినా కూడా.. అంత డబ్బు రేపు కోర్టులు కట్టమంటే.. కట్టలేము కదా? అని ప్రశ్నించారు.

అధికారులు చేసే పిచ్చి పనుల వలన.. మా పార్టీని బ్రస్టు పడుతుందని అన్నారు. మంచి చెప్పిన విభీషనుడిని రావణాసురుడు భహిష్కరించాడు.. అలా భహిష్కరిస్తే ఏం చెయ్యలేనని.. మంచి వినకపోతే.. మా పార్టీ దురదృష్టం.. అని అన్నారు. ఇదే సమయంలో జగన్ పుట్టినరోజు సంధర్భంగా జరిగిన రక్తదానాలను ‘జగనన్న రక్తదోపిడి’గా అభివర్ణించారు రఘురామ కృష్ణంరాజు. పుట్టినరోజు నాడు.. బలవంతంగా రక్తం దోచుకోవడం అనేది కరెక్ట్ కాదని, పథకాలు రావని బయపెట్టి ప్రతీ ఇంటి నుంచి రక్తదాతలను బలవంతంగా రప్పించడం మంచిపని కాదని అన్నారు. రక్తదానం మంచి పనే అయినా.. అనుసరించిన విధానం కరెక్ట్ కాదని అన్నారు.