మాపై పోటీ చేస్తే పథకాలు కట్.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

182

పంచాయితీ ఎన్నికల్లో బెదిరింపులు పరిపాటిగా మారిపోయాయి. మంత్రులు ఎమ్మెల్యేలేలు బెదిరింపులకు దిగుతుండటంతో ఎన్నికల్లో పోటీచేద్దామని సిద్దమైన వారు కూడా నామినేషన్లు వెనక్కు తీసుకుంటున్నారు. వీళ్ళతో మనకెందుకులే అని కొందరు ఓటు వేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. ఇదిలా ఉంటే వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్లు వేస్తే పథకాలు కట్ చేస్తామంటూ ప్రజలను హెచ్చరించారు కృష్ణాజిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్.

రూరల్ మండలంలోని మునిపెడ గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం చేసిన స్థానిక ఎమ్మెల్యే జోగి రమేష్.. బహిరంగసభలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీపై ఎవరైనా నామినేషన్లు వేస్తే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. బహిరంగ సభలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థులు కాకూండా ఇతరులు ఎవరైనా వార్డు మెంబర్లుగా నామినేషన్ వేస్తె ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు.

జగనన్న ఇస్తున్న పథకాలు తీసుకుంటూ వేరే పార్టీల్లో పోటీ చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని.., పెన్షన్, కాపునేస్తం అమ్మఒడి, ప్రతి పథకాన్నీ కూడా కట్ చేసిపారేస్తామని హెచ్చరించారు. అయితే మునుపెడ గ్రామంలో ఒక సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి. వారు పోటీ చేస్తారనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. కాగా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసే హక్కు ఉందని బెరించడానికి మీరెవరని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.

మాపై పోటీ చేస్తే పథకాలు కట్.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు