గాల్లోకి కాల్పులు జరిపిన వైసీపీ నేత

70

కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం పాయసంపల్లెలో వైసీపీలోకి ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. నూతన సంవత్సరం సందర్బంగా వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టారు. అయితే ఈ పోస్టులపై మహేశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి వర్గీయుల మధ్య పరస్పర దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సుధాకర్ రెడ్డి గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పలువురిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

 

గాల్లోకి కాల్పులు జరిపిన వైసీపీ నేత