వైసీపీ ప్రభుత్వంలో దేవుళ్ళకు కూడా రక్షణ లేదు.

81

వైసీపీ ప్రభుత్వంలో దేవుళ్ళకు కూడా రక్షణ లేదు.

విజయనగరం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలోని బోడికొండపై సుమారు 400 ఏళ్ల నాటి శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి తల భాగాన్ని వేరు చేసిన విషయం విదితమే. ఈ ఘటనపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హిందూ సంఘాల నేతలు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై టీడీపీ నేతలు కూడా స్పందించారు.

జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన 19 నెలల్లో అనేక దేవాలయాలపై దాడులు జరిగాయని టీడీపీ మహిళానేత అనిత ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, మహిళలు, టీడీపీనేతలపైనే కాదు దేవాలయాలపై కూడా దాడులు జరుగుతున్నట్లు తెలిపారమే. సర్వతమత సమానత్వం పాటించమని రాజ్యాంగం చెబుతుంటే వైసీపీ మాత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెల్లూరు రథం దహనం, అంతర్వేది, చిత్తూరు హనుమాన్ విగ్రహం ధ్వంసం, ఇలా ఎన్నో దేవాలయాలపై దాడులు జరిగినట్లు వివరించారు. జగన్ ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు.