ఫుట్ బాల్ ఆటలో కొత్త చరిత్ర..

85

ఫుట్ బాల్ లో పాత రికార్డులను చెరిపివేశారు న్యూపోర్ట్ కౌంటీకి చెందిన గోల్‌కీపర్ టామ్ కింగ్ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక దూరం నుంచి గోల్ కొట్టాడు. చెల్టెన్‌హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్ తన గోల్ పోస్ట్ నుంచి ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌లోకి బాల్‌ని కిక్ చేయడం విశేషం. ఒక్క బౌన్స్ తో బాల్ ప్రత్యర్థి గోల్ పోస్ట్ లోకి వెళ్ళింది. టామ్ కింగ్ కిక్ ఇచ్చిన బంతి ప్రత్యర్థి గోల్ కీపర్ కు అందకుండా గోల్ పోస్ట్ లోకి వెళ్ళింది. బాల్ స్టెప్ తీసుకోకుండా 96.01 మీటర్ల దూరం వెళ్ళింది, అంటే 315 అడుగులు అన్నమాట. ఇంత దూరం బంతిని కిక్ ఇచ్చిన ఆటగాళ్లు ఎవరు లేరు.

టామ్ కింగ్ గోల్ తో 2013 లో అస్మిర్ బెగోవిక్ కొట్టిన 91.9 మీటర్ల గోల్ రికార్డ్ మరుగున పడిపోయింది. ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వెబ్‌సైట్ ధృవీకరించింది. అయితే ఈ సమయంలో టామ్ కి గాలి సహకరించింది. గాలి వీచే దిశ ప్రత్యర్థి గోల్డ్ పోస్ట్ వైపే ఉంది. దింతో బాల్ అంతదూరం వెళ్లేందుకు గాలి సహాయపడింది విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా అంత దూరం బాల్ ని తన్నడం అంటే సాధారణ విషయం కాదని ఫుట్ బాల్ నిపుణులు చెబుతున్నారు.

ఫుట్ బాల్ ఆటలో కొత్త చరిత్ర..