ప్రపంచంలోనే ఖరీదైన బిర్యానీ ఇది

782

బిర్యానీ.. ఈ పేరు వినగానే చాలామంది ఒళ్ళు పులకరిస్తుంది.. ఎప్పుడెప్పుడు తిందామా అని ఆత్రుత పడుతుంటారు. ఇక బిర్యానీకి హైదరాబాద్ పెట్టింది పేరు.. ఇక్కడ గల్లీకో బిర్యానీ సెంటర్ ఉంటుంది. దమ్ బిర్యానీ, హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, ఇలా పదుల రకాల బిర్యానీలు మన నగరంలో లభిస్తాయి.. ధర కూడా సామాన్యులకు అందుబాటులోనే ఉంటుంది. 100 రూపాయల నుంచి 2000 వేలకు లోపులోనే హైదరాబాద్ బిర్యానీ ధరలు ఉంటాయి. ఇక హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ఉంది.. దీనికి ఎందరో అభిమాలు ఉన్నారు. వెజ్, నాన్ వెజ్ వెరైటీలలో లభించే ఈ ఆహారాన్నీ చాలామంది ఇష్టంగా తింటారు.

దేశంలో ప్రతి సెకనుకు పదుల సంఖ్యలో బిర్యానీలు అమ్ముడుపోతాయి. ఇక న్యూ ఇయర్ సీజన్ లో అయితే వీటి సంఖ్య ఎక్కువే ఉంటుంది. సెకనుకు వందల సంఖ్యలో అమ్ముడుపోతుంటాయి. ఇక అత్యధిక ధర కలిగిన బిర్యానీ తినాలి అంటే మనం దుబాయ్ వెళ్లాల్సిందే.. దుబాయ్ లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ లో ఉన్న బొంబాయి బోరో అనే రెస్టారెంట్ లో అత్యధిక ధర కలిగిన బిర్యానీ లభిస్తుంది. దీనిని 23 క్యారెట్ల బంగారంతో తయారు చేస్తారు. భారత దేశంలోని నాలుగు ప్రాంతాల్లో ఫేమస్ అయ్యిన నాలుగు రకాల బిర్యానీలను ఇక్కడ దొరుకుతాయి. ఇక దీని ధర 1000 దిన్హార్ లు అంటే భారత కరెన్సీలో 19 వేలకు పైగా ఉంటుంది. రుచి అద్భుతంగా ఉండటంతో ఈ బిర్యానీల కోసం దుబాయ్ ప్రజలు క్యూలు కడుతున్నారట. ఇక ఆ దేశానికి వచ్చే టూరిస్టులు బిర్యానీ తినేందుకు ఎగబడుతున్నారట.

ప్రపంచంలోనే ఖరీదైన బిర్యానీ ఇది