కేరళ పోలీసుల తెలివి.. ప్రమోషన్ కోసం బన్నీని వాడేశారు!

649

ఒకప్పుడంటే మన తెలుగు హీరోలకు పరభాషలో అంతగా ఆదరణ ఉండేది కాదు. తమిళ హీరోలు మన దగ్గర స్టార్స్ అయ్యారు కానీ పాతతరంలో మన హీరోల సినిమాలకు పెద్దగా ఇతర దక్షణాది బాషలలో ఆదరణ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మన హీరోలకు ఇతర బాషలలో సైతం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. మన సినిమాలు ఆయా బాషలలో డైరెక్ట్ రిలీజ్ చేసే స్థాయికి అక్కడ బిజినెస్ జరుగుతుంది. దాదాపుగా మన కుర్ర హీరోలందరికీ ఇతర బాషలలో మంచి క్రేజ్ ఉంది.

మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు మలయాళంలో సూపర్ క్రేజ్ ఉంది. అందుకే బన్నీ ప్రతి సినిమా అక్కడ రిలీజై భారీ వసూళ్లను దక్కించుకుంటుంది. కాగా.. ఇప్పుడు కేరళ పోలీసులు బన్నీ క్రేజ్ ను వాడేసుకుంటున్నారు. ఆప‌ద స‌మ‌యంలో ఉన్న‌ప్పుడు పోల్ యాప్‌ను ఉప‌యోగించాల‌ని తెలియ‌జేసిన వారు రేసుగుర్రం సినిమాలోని సీన్‌ను జ‌త చేశారు. కేర‌ళ పోలీసుల తెలివి తేట‌ల‌కు నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు. ఓ మంచి పనికి బన్నీ సినిమాలో సీన్ వాడుకోవడంతో బన్నీ ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు.

ప్ర‌స్తుతం అల్లు అర్జున్ పుష్ప అనే సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతుంది. ఈ సినిమా ఆగ‌స్ట్ 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఈ సినిమాలో బన్నీ సరసన రష్మికా మందనా హీరోయిన్ నటిస్తుంది. ఒక్క తెలుగు నటులనే కాదు ఇతర బాషల నటులను కూడా సినిమా కోసం తీసుకున్న మేకర్స్ బన్నీ కెరీర్ లో మరో భారీ సినిమాగా పుష్పని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంతో బన్నీ ప్రేక్ష‌కుల‌ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేయ‌నున్నాడ‌ని తెలుస్తుంది.

కేరళ పోలీసుల తెలివి.. ప్రమోషన్ కోసం బన్నీని వాడేశారు!