డిఎంకెతో కలిసి పనిచేయను : ఎంకే అళగిరి

94

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు నెలలు ముందే డీఎంకే పార్టీకి షాక్ తగిలింది, రాబోయే ఎన్నికలలో తాను డిఎంకెతో కలిసి పనిచేయబోనని కరుణానిధి కుమారుడు, డిఎంకె అధినేత స్టాలిన్ కుమారుడు ఎంకె అలగిరి ప్రకటన చేశారు.

చెన్నైలోని గోపాలపురంలోని కుటుంబ నివాసంలో తన తల్లిని కలిసిన తరువాత మీడియాతో మాట్లాడిన అలగిరి, 2021 జనవరి 3న తన మద్దతుదారులను కలుస్తానని, వారి కోరిక మేరకు తన భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు.

అయితే అళగిరి త్వరలో కొత్త పార్టీ పెడతారనే వార్తలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు అళగిరి కొత్త పార్టీని స్థాపించి రజనీకాంత్ పార్టీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని తమిళనాట చర్చ జరుగుతోంది. అయితే దీనిపై అళగిరి మాత్రం స్పందించలేదు.