గ్రామాల్లోకి వన్యమృగాలు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్న జనాలు

72

తెలంగాణలోని పలు జిల్లాలో వన్యమృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడం జిల్లాతోపాటు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వన్యమృగాలు సంచరిస్తున్నాయి. తాజాగా గచ్చిబౌలిలో చిరుతపులి తిరుగుతున్నట్లుగా గుర్తించారు స్థానికులు. దింతో అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు.

చిరుత తిరిగిన ఆనవాళ్లు సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి. ఇక భద్రాద్రి కొత్తగూడం జిల్లాలోని టేకులపల్లి మండలం గుండ్లమడుగు అటవీ ప్రాంతంలో ఆవుదూడలపై పులి దాడి చేసింది. ఈ దాడిలో ఆవుదూడల మెడ కాళ్లపై తీవ్రగాయాలయ్యాయి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల దాడిలో 2019 – 2020 మధ్య 20 మంది మరణించినట్లుగా గణాంకాలు చెబుతున్నారు. పొలాలకు వెళ్లిన వారిపై పులులు దాడి చేసి చంపుతున్నాయి.

వన్య మృగాలు గ్రామాల్లోకి రావడానికి కారణాలను పరిశీలిస్తే, అటవీ ప్రాంతాల్లో మైనింగ్ చేస్తున్నారు, ఈ నేపథ్యంలోనే బ్లాస్టింగ్స్ చేస్తున్నారు ఆ శబ్దాలకు వన్యమృగాలు గ్రామాల్లోకి వస్తున్నట్లు సమాచారం. ఇక మరోవైపు అడవులు క్రమక్రమంగా అంతరించి పోతుండటంతో వన్యమృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. అటవీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లోకి వన్యమృగాలు నిత్యం వస్తున్నాయి.

ప్రధానంగా రిజర్వుడ్ ఫారెస్ట్ ఉన్న ప్రాంతాల్లో వీటి సంచారం అధికంగా ఉంది. గ్రామాల్లోకి వచ్చి పశువులపై దాడి చేసి చెంపేస్తున్నాయి. వన్యమృగాల బారినుంచి తమను కాపాడాలని బాధిత గ్రామాల ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.

తెలంగాణలో గ్రామాల్లోకి వన్యమృగాలు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్న జనాలు