నోటీసులు పంపిన భార్య.. విద్యుత్ టవర్ ఎక్కిన భర్త

279

భార్య విడాకుల నోటీసులు పంపడంతో మనస్తాపం చెందిన భర్త విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు.. ఈ ఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాస్ లో చోటుచేసుకుంది. టవర్ ఎక్కిన వ్యక్తి రెండు గంటలపాటు అలజడి రేకెత్తించాడు. పోలీసులను భయానికి గురిచేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పుట్టపర్తి నగరపంచాయితీ బ్రాహ్మణపల్లికి చెందిన రవి, ట్రాక్టర్ డ్రైవర్ గ పనిచేస్తున్నాడు. ఇతడికి లక్ష్మితో వివాహం జరిగింది.. ఈమె అనంతపురం పట్టణం. వీరిద్దరికి ఓ పాప ఉంది.

తాగుడుకు అలవాటు పడిన రవి రోజు తాగి ఇంటికి వచ్చే వాడు.. దింతో అతడితో వేగలేక పుట్టింటికి వెళ్ళింది లక్ష్మి .. తనను తీసుకెళ్లడానికి రాకపోవడం.. తాగుడు మనకపోవడంతో విడాకుల నోటీసులు పంపింది లక్ష్మి. దీంతో మనస్థాపానికి గురైన రవి శుక్రవారం సాయంత్రం మామిళ్లకుంట క్రాస్‌లో సమీపంలో మద్యం సేవించి 11కేవీ విద్యుత్‌ టవర్‌ ఎక్కాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, విద్యుత్‌ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అతడిని కిందకు దించేందుకు రెండుగంటలు శ్రమించారు.

మెయిన్ లైన్ విద్యుత్ సరఫరా నిలిపివేసి టవర్ పైకి ఎక్కారు సిబ్బంది. వారిని చూసి ఇంకా పైకి వెళ్ళాడు రవి. తనకు విడాకులు వద్దని భార్యే కావాలని బీష్మించుకు కూర్చున్నాడు. పోలీసులు రవికి నచ్చచెప్పి కిందకు దించారు. అనంతరం అతడిని అనంతపురం రూరల్‌ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు.

నోటీసులు పంపిన భార్య.. విద్యుత్ టవర్ ఎక్కిన భర్త