Nagarjuna: మన్మధుడు ఎందుకో వెనక బడ్డాడా?

354

మన్మధుడు నాగార్జున అంటే ఇప్పటికీ లేడీ ఫాలోయింగ్ లో ఏ మాత్రం ఢోకా లేదు. నాగ్ కూడా అందుకు తగ్గట్లుగానే ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా గ్లామర్ మైంటైన్ చేస్తున్నాడు. సహజంగానే ఫిట్నెస్ ను ఇష్టపడే ఈ హీరో ఎప్పటికప్పుడు మేకోవర్ మీద కాస్త శ్రద్ద చూపిస్తూ తన తోటి హీరోలకు ఏ మాత్రం అందనంతగా మన్మధుడి ముద్ర వేసుకున్నాడు. నాగ్ సినిమా రిలీజ్ అయితే ఇప్పటికీ మహిళలే ముందు టిక్కెట్లు తెంచేది. మార్కెట్ లో కూడా నాగ్ సినిమాలకు ఏమాత్రం ఇబ్బంది లేదు. అయితే.. నాగ్ ఇప్పుడు ఎందుకు వెనక బడ్డాడా అనిపిస్తుంది.

తన తోటి సీనియర్ హీరోలు చిరు, బాలయ్య, వెంకీ వరస సినిమాలకు సైన్ చేస్తూ బిజీగా ఉన్నారు. కానీ నాగ్ మాత్రం డైలమాలో ఉన్నాడు. ప్రస్తుతం నాగ్ వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ దశలో ఉంది. కానీ రిలీజ్ ఎప్పుడంటే మాత్రం క్లారిటీ లేదు. సినిమాకి సంబంధించి పోస్టర్లు, టీజర్లు అంటూ మూవీ మేకర్స్ అంతా సినిమా మీద హైప్స్ పెంచుతుంటే వైల్డ్ డాగ్ యూనిట్ మాత్రం ఆ విషయాన్ని వదిలేశారేమో అనిపిస్తుంది. నాగార్జునే స్వయంగా సోషల్ మీడియాలో ఈ సినిమా అప్డేట్స్ షేర్ చేస్తున్నాడు.

వైల్డ్ డాగ్ విషయం పక్కన పెడితే ఈ సినిమా తర్వాత నాగ్ చేయబోయే సినిమాలేంటి అనే అంశంపై కూడా క్లారిటీ లేదు. రాజశేఖర్ గరుడవేగ తెరకెక్కించిన ప్రవీణ్ సత్తారుతో సినిమా చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. ఆ సినిమా ఎక్కడ ఉందో ఏమో ఎవరికీ తెలియదు.. చెప్పడంలేదు. ఇక నాగ్ బంగార్రాజు అనే మరో సినిమా కూడా ప్రకటించాడు. అదీ అంతే. దీంతో ఇప్పుడు నాగ్ ట్రాక్ తప్పాడా.. లేక వయసు రీత్యా ఆచితూచి వ్యవహరిస్తున్నాడా అనేది అర్ధంకాక అభిమానులు నిరాశలో ఉన్నారు. మరి నాగ్ కాస్త జోష్ పెంచి అభిమానులకు కనువిందు చేస్తాడా లేక ఇలానే స్లో అండ్ స్టడీలోనే వెళ్తాడా అన్నది చూడాలి!

Nagarjuna: మన్మధుడు ఎందుకో వెనక బడ్డాడా?