తల విలువ నోరు చెబుతుంది అంటే ఇదేనేమో!

150

ఎవరు ఎలాంటివారో తెలుసుకోవాలంటే వారితో కొంతసేపు మాట్లాడితే సరిపోతుందని పెద్దలు చెబుతుంటారు. అయితే వారి మాటను బట్టి కూడా వారు చేసె పని.. స్థాయి ఏంటో అంచనా వేయొచ్చు.. అది ఎలాగో ఈ కథ ద్వారానే తెలుసుకోండి.. ఓసారి విక్రమాదిత్య మహారాజు తన సైనికులు, మంత్రితో వేటకై అడవికి వెళ్ళాడు. వేటాడుతూ వేటాడుతూ.. అడవిలో ఒకరికొకరు దూరమయ్యారు. ఒకచోట చెట్టుకింద అంధుడు, వృద్ధుడు అయిన సాధువు కూర్చుని ఉండగా చూసి.. సాధుమహారాజ్.. ఇటువైపు ఎవరైనా ఇంతకుముందు వెళ్ళారా? అని అడిగారు. ఆ అంధ సాధువు ఇలా అన్నారు. మహారాజ అందరికంటే ముందు మీ సేవకుడు వెళ్ళాడు.. అతనికి వెనుక మీ సేనానాయకుడు వెళ్ళాడు.. సేనానాయకుని తరువాత మీ మంత్రి కూడా ఇంతకుముందే వెళ్ళాడు అని బదులిచ్చారు. అంధుడైన ఆ సాధువు చెప్పిన సమాధానం విని విక్రమాదిత్యుడు ఆశ్చర్యంతో.. ఆసక్తితి ఇలా అన్నారు.. మహాత్మ మీకు నేత్రాలు కనిపించవు కదా..?

మా సేవకుడు, సేనానాయకుడు, మంత్రి ఇప్పుడే వెళ్లినట్లు ఎలా గ్రహించారు.. నేను రాజునైనట్లు కూడా ఎలా కనుగొన్నారు..? అని అడిగారు. అప్పడూ ఆ అంధ సాధువు ఒక నవ్వు నవ్వి.. మహారాజ నేనా ముగ్గురిని మాటలు వినే కనిపెట్టాను.. అందరికంటే ముందు సేవకుడు వచ్చి నాతో ఏమిరా గుడ్డివాడా ఇటు ఎవరైనా వచ్చారా? అని అడిగాడు.. అలాగే కొంతసేపటికి సేనానాయకుడు వచ్చి సూర్దాస్ ఇటు ఎవరైనా వెళ్ళారా? అని అడిగాడు.. చివరకు మీ మంత్రి వచ్చి సూర్దాస్ జి ఇటు ఎవరైనా వెళ్ళారా అని అడిగారు. తరువాత మీరు వచ్చి సాధుమహారాజ్ ఎటు ఎవరైనా బాటసారులు వెళ్ళారా అని అడిగారు.. మహారాజా ఒక వ్యక్తి ఒక్క వాక్కు ద్వారా అతని పదవి అతని ప్రతిష్ట ఏమిటో మేము గుర్తించగలం అని బదులిచ్చారు ఆ సాధువు. తల విలువ నోరు చెబుతుంది అంటే ఇదేనేమో.