టీఆర్ఎస్ నేతల ‘రామ’భజన వెనుక ఆంతర్యమిదేనా?

152

తెలంగాణ అధికార పార్టీలో ఇప్పుడు తీవ్రంగా వినిపిస్తున్న మాట కాబోయే సీఎం కేటీఆర్.. మరికొందరైతే ఆల్రెడీ కేటీఆర్ సీఎం అయిపోయారని కూడా శుభాకాంక్షలు చెప్పేశారు. కొందరు అధికారులు సైతం కంగ్రాట్స్ సీఎం సార్ అంటూ అనధికారంగానే విషెష్ చెప్పగా.. పార్టీలో కూడా కేటీఆర్ సీఎం అంటూ హైకమాండ్ నుండి ఆదేశాలు వెళ్లాయని కూడా ఊహాగానాలు వినిపించాయి. సాక్షాత్తు మంత్రులు.. పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి దగ్గరగా ఉండే నేతలు సైతం కేటీఆర్ సీఎంగా అన్ని విధాలా అర్హుడే అంటూ చేసిన ప్రకటనలు ప్రతిపక్ష పార్టీలను కూడా మెంటల్ గా ప్రిపేర్ చేశాయి.

అయితే.. కేటీఆర్ సీఎం అంటే మాటలు కాదు. దానికి ఎన్నో విధాలు కసరత్తులు చేయాలి. తెర వెనుక జరిగే ఆ కసరత్తులు కూడా మంత్రులు, టీఆర్ఎస్ నేతలకు తెలియనిది కాదు. మరి నేతలు ఆ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నట్లు?.. పదే పదే శుభాకాంక్షలు చెప్పడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందని రకరకాల చర్చలు జరుగుతున్నాయి. నిజానికి కేటీఆర్ సీఎం అనే అంశం పార్టీ హైకమాండ్ వదిలిన ఒక ట్రైలర్ కాగా దాని రివ్యూని బట్టి పార్టీ పెద్దలు తగిన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ కేటీఆర్ సీఎం అయితే ప్రస్తుతం ఉన్న కేసీఆర్ క్యాబినెట్ రద్దయి కొత్త క్యాబినెట్ రావాల్సి ఉంది. ఆ కొత్త క్యాబినెట్ లో కూడా బెర్త్ దక్కించుకోవాలనే ప్రస్తుతం పదవులలో ఉన్న వాళ్ళు రామ భజన చేస్తుండగా.. వచ్చే కొత్త టీంలో అయినా ప్లేస్ దక్కించుకోవాలనే పదవులు ఆశించే నేతలు భజనకు సిద్దపడుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా గులాబీ పార్టీలో తారక రాముడే మా ముఖ్యమంత్రి అనే టాక్ గట్టిగా మొదలైంది. అయితే.. కేసీఆర్ రిటైర్మెంట్.. లేదా సెంట్రల్ పాలిటిక్స్ కి వెళ్లడం.. వారసుడికి పట్టాభిషేకం అంత సులభం కాదన్నది రాజకీయ వర్గాలలో అందరికీ తెలిసిందే.

టీఆర్ఎస్ నేతల ‘రామ’భజన వెనుక ఆంతర్యమిదేనా?