మహిళను కోట్లాధికారిని చేసిన తిమింగలం వాంతి!

976

అదృష్టం ఉండాలి కానీ మనం కళ్ళు మూసుకొని వెళ్తున్నా కాళ్లకు తగులుతుంది అంటారు. మరి అలాంటిది అదృష్టం బంకలాగా తగులుకుంటే ఎలా ఉంటుంది. ఇదిగో ఈ థాయ్‌లాండ్‌ మహిళ లాగా ఉంటుంది. సరదాగా బీచ్‌కు వెళ్లిన ఆమెకు ఒడ్డున ఓ వింత వస్తువు కనిపిస్తే వద్దనుకుంటునే ఆమె దాన్ని ఇంటికి పట్టుకొచ్చింది. అలా అయిష్టంగా తీసుకొచ్చిన ఆ వస్తువు తీరా చూస్తే కోట్లు పలుకుతుందని తెలిసి ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇంతకు ఆ వికారమైన వస్తువు ఎంటో చెప్పలేదు కదూ. అది ఓ తిమింగలం వాంతి. దాని విలువు 2.50లక్షల డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ.1.9కోట్లు).

థాయ్‌లాండ్‌కు చెందిన సిరిపోర్న్ నియామ్రిన్(49) అనే మహిళ ఈ నెల 23న తన ఇంటి సమీపంలో ఉండే నాఖోన్ సి తమ్మరత్ ప్రావిన్స్ బీచ్‌కు సరదాగా వెళ్లింది. ఆ సమయంలో ఆమెకు బీచ్ ఒడ్డున ఓ వింత వస్తువు కనిపించింది. చుడ్డానికి ఎంతో వికారంగా ఉన్న ఆ వస్తువును కొద్దిసేపు దాన్ని అలా చూస్తు ఉండిపోయిన నియామ్రిన్ అయిష్టంగానే చేతుల్లోకి తీసుకుంది. దాని నుంచి సాధారణంగా చేప నుంచి వచ్చే ఏదో వాసన వస్తోంది. దాంతో ఆమె ఈ వస్తువుకు ఎంతోకొంత డబ్బు రావొచ్చని ఇంటికి పట్టుకొచ్చింది. ఆ తర్వాత తమ చుట్టుపక్కల వారికి దానిని చూపించడంతో ఆమెకు అసలు విషయం తెలిసింది.

అది కోట్లు విలువ చేసే తిమింగలం వాంతి కాగా దానిని సుగంధ ద్రవ్యాల తయారీలో వినియోగిస్తారని చెప్పారు. నియామ్రిన్‌కు దొరికిన తిమింగలం వాంతి 24 ఇంచుల పొడువు, 12 ఇంచుల వెడల్పుతో సుమారు 7 కిలోల బరువు ఉండగా అది సుమారు రూ. 1.9కోట్లు విలువ చేస్తుందని చెప్పడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. తిమింగలాలు తినే జీవుల వల్ల గొంతులోపలి భాగాలు దెబ్బతినకుండా స్రవించే ద్రవమే వాంతి రూపంలో బయటపడుతుంది. ఇది చాలా విలువైనది కాగా అందుకే శాస్త్రవేత్తలు దీనిని నీటిపై తేలియాడే బంగారం అని కూడా పిలుస్తారు. సుగంధ ద్రవ్యాల తయారీలో వాడే వాంతి ఇది బూడిద రంగులో మైనం ముద్దలా ఉండి మండే గుణం కూడా కలిగి ఉంటుందట.

మహిళను కోట్లాధికారిని చేసిన తిమింగలం వాంతి!