West Godavari: ట్రాక్టరును ఢీ కొట్టిన లారీ.. ముగ్గురు మృతి!

15476

West Godavari: చిన్నపాటి నిర్లక్ష్యం.. ఏమరుపాటు వలన నిత్యం రహదారులు నెత్తురోడుతున్నాయి. ప్రాణాలు గాల్లో కలిసి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఏపీలోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఆదివారం ఉద‌యం ఘోర రోడ్డుప్ర‌మాదం సంభ‌వించింది. బుట్టాయిగూడెం వ‌ద్ద నిలిపి ఉంచిన ట్రాక్ట‌ర్ ట్రాలీని వేగంగా వ‌చ్చిన ట్ర‌క్కు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో అక్క‌డిక‌క్క‌డే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మ‌రో 17 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. 108 వాహనాలలో క్ష‌త‌గాత్రుల‌ను ఏలూరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఉదయాన్నే జరిగిన ఈ ప్రమాదంతో జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.