మమతకు ముగ్గురు ఎమ్మెల్యేల షాక్.. పార్టీకి రాజీనామా

69

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా బెనర్జీని కష్టాలు వెంటాడుతున్నాయి. వరుసగా తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. శుక్రవారం తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే శిలాభద్ర దత్తా పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి పంపించారు.

కొద్దిరోజులుగా రాష్ట్రంలో పాలన సరిగా జరగడంలేదని.. శాంతిభద్రతలు క్షీనిస్తున్నాయని ఆరోపించారు. కాగా అంతకుముందే తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలు శుభేందు అధికారి, జితేంద్ర తివారీ కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు త్వరలో బీజేపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి.