ముగ్గురి ప్రాణం తీసిన వాటర్ హీటర్.

120

మృత్యువు ఏ రూపంలో వస్తుందో అర్ధం కావడం లేదు. ఇంట్లో రోజు వాడే వస్తువులే ప్రాణాలు తీస్తున్నాయి. కాగా కర్నూలు జిల్లాలో వాటర్ హీటర్ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని హాలహర్వి మండలం గుల్యంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. సవిత (35) ప్లాస్టిక్ బకెట్లో నీరు పోసి హీటర్ పెట్టింది. నీరు వేడి కావడంతో స్విచ్ ఆపి బకెట్లో చెయ్యి పెట్టింది.

దింతో ఆమెకు కరెంట్ షాక్ కొట్టి పడిపోయింది. తల్లి కిందపడటంతో ఆమెను లేపేందుకు వెళ్లిన కుమారులు నశ్చల్ కుమార్ (11), వెంకట సాయి ముని (8) కరెంట్ షాక్ కు గురయ్యారు. దింతో వారిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు పోలీసులు.

ముగ్గురి ప్రాణం తీసిన వాటర్ హీటర్.