వరంగల్ జిల్లాలో కలకలం

58

గత కొద్దీ రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేమికుల ఆత్మహత్యలు అధికమయ్యాయి. తెలంగాణలో రోజుకు రెండు, మూడు ప్రేమ జంటలు ఆత్మహత్యకు పాల్పడుతున్నాయి. గురు, శుక్రవారల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు ప్రేమ జంటలు ఆత్మహత్యకు పాల్పడ్డాయి. వీరిలో ఓ జంట చేతులకు తాళ్లు కట్టుకొని బావిలో దూకగా, మరో జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరిల్లోకి వెళితే ఖిల్లా వరంగల్ మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన సాయి (23), అశ్వినీ (19) లు ఒకరినొకరు ప్రేమించుకున్నారు.

ఇదే విషయాన్నీ కుటుంబ సభ్యులకు తెలియచేశారు. కాగా వారు పెళ్ళికి ఒప్పుకోలేదు. దింతో గురువారం ఇంటి నుండి బయటకు వెళ్లి వస్తానంటూ చెప్పిన ప్రేమజంట ఆ తరువాత తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు స్నేహితులకు ఫోన్ చేసి అడగ్గా తమకు తెలియదని సమాచారం ఇచ్చారు. సాయి, అశ్వినీ, ఇద్దరు వెళ్లి వ్యవసాయ బావిలో దూకారు. బావి దగ్గర చెప్పులు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇక మరో జంట శుక్రవారం అర్ధరాత్రి సమయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ రూరల్ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఏర్రమల్లయ కుంట సమీపంలోని బుడగ జంగాల కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు మైనర్లు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. మృతులు శిరీషాల లక్ష్మి (16), చరుల్లా అంజి (17)గా గుర్తించారు పోలీసులు.