సీఎం జగన్ కి క్షమాపణలు చెప్పిన వలంటీర్లు

154

తనకు జీతాలు పెంచాలంటూ వలంటీర్లు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.. కాగా వలంటీర్ల చర్యపై సీఎం జగన్ స్పందించారు. ఈ మేరకు మంగళవారం ఓ లేఖను విడుదల చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే వలంటీర్లు స్పందించారు. విజయవాడ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద జరిగిన ఘటనలో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. వారి వెనక ఎవరో ఉండి ఇదంతా చేయించారని తెలిపారు. తాము వినతిపత్రం అందించేందుకు వెళ్ళమని, విజయవాడలో జరిగిన ర్యాలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసింది కాదని అన్నారు. వలంటీర్లు అందరి తరుపున సీఎం జగన్‌కి క్షమాపణలు చెబుతున్నాము’’ అని తెలిపారు.

కాగా మంగళవారం జగన్ వలంటీర్లను సున్నితంగా హెచ్చరించారు. వలంటీర్లు అంటే స్వచ్చందంగా పనిచేసేవారని తెలిపారు. వారికీ గౌరవ వేతనం ఇస్తామని, జీతం ఇవ్వడం సాధ్యం కాదని వివరించారు. నియామక సమయంలోనే దీనికి సంబందించిన అన్ని విషయాలను తెలిపామని, ఇప్పుడవి వేతనాలు పెంచమని అడగడం పద్దతి తెలిపారు. కాగా వలంటీర్ల ర్యాలీ జగన్ ను ఆగ్రహానికి గురిచేసినట్లు తెలుస్తుంది. స్వచ్చందంగా పనిచేయాల్సిన వారు రోడ్లపైకి రావడం పలు అనుమానాలకు తావిస్తుంది.

సీఎం జగన్ కి క్షమాపణలు చెప్పిన వలంటీర్లు