Ap panchayat elections నాడు వలంటీర్.. నేడు సర్పంచ్

139

వలంటీర్ గా పనిచేసిన ఓ మహిళ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లా కదిరి మండలం ముత్యాలచెరువు పంచాయితీకి చెందిన శుభలేఖ పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకు వలంటీర్ గా సేవలందించారు. పంచాయితీ ఎన్నికలు రావడంతో గ్రామస్తుల కోరిక మేరకు నామినేషన్ దాఖలు చేశారు. ఈమెకు పోటీగా మరో ముగ్గురు నామినేషన్ దాఖలు చేయగా, గ్రామస్తులు వారిని ఒప్పించి ఉపసంకరించుకునేలా చేశారు.

దింతో శుభలేఖ సర్పంచ్ గా ఏకగ్రీవ ఎన్నిక అయ్యారు. వలంటీర్ గా మంచి సేవలు అందించారని… శుభలేఖ సర్పంచ్ అయితే మరింత మందికి సేవ చేసే అవకాశం లభిస్తుందని అందుకే ఆమెను ఏకగ్రీవం చేసేందుకు గ్రామమంతా ఏకమైదని గ్రామపెద్దలు మీడియాకు తెలిపారు. వలంటీర్ సర్పంచ్ కావడంతో తోటి వలంటీర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్‌ పెడబల్లి వెంకటసిద్ధారెడ్డిని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా ఆమె కలవగా, పూలమాలతో సన్మానించారు. ప్రజలకు నిస్వార్ధంగా సేవచేయాలని ఎమ్మెల్యే తెలిపారు.

Ap panchayat elections నాడు వలంటీర్.. నేడు సర్పంచ్