వీజే చిత్ర ఆత్మహత్య కేసులో కొత్తకోణం. వెలుగులోకి తెలుగు యువహీరో పేరు

120

తమిళ సీరియల్ నటి వీజే చిత్ర ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసు విచారణలో ఓ తెలుగు యువ హీరో పేరు వినిపిస్తుంది. చిత్రను అతడు బ్లాక్ మెయిల్ చేసినట్లు చిత్ర స్నేహితురాలు ఒకరు వెల్లడించారు. ఆమె ప్రైవేట్ వీడియోస్ భర్త హేమంత్ కు పంపుతానని ఓ తెలుగు హీరో వేదించాడట. కాగా హీరో పేరు మాత్రం బయటకు రాలేదు. రెండు మూడు రోజుల్లో పేరు బయటకు వచ్చే అవకాశం ఉంది.

కాగా హేమంత్ వల్లనే వీజే చిత్ర ఆత్మహత్యకు పాల్పడినట్లు సన్నిహితులు చెబుతున్నారు. చిత్రతో హేమంత్ తరచూ గొడవపడేవాడని వారు వివరించారు. షూటింగ్ జరిగే ప్రదేశానికి వచ్చి గొడవ పడేవాడని తెలిపారు. ఆమె ఆత్మహత్య చేసుకునే రోజు కూడా షూటింగ్ ప్లేస్ కి వచ్చి ఆమెను వేధించాడని వివరించారు. గొడవ పడ్డాడని, అటునుంచి కారులో హోటల్ కు తీసుకెళ్లారని తెలిపారు. హోటల్ లో కూడా గొడవపడి ఉంటారని. అందుకే మనస్తాపంతో చిత్ర ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.

అయితే తెలుగు హీరో విషయం బయటకి రావడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. ప్రైవేట్ వీడియోస్ హేమంత్ కి పంపాడేమో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే పోలీసులు విచారణలో వేగం పెంచారు. ఈ కేసు విచారణలో తెలుగు హీరోకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. నోటీసులు అందితే ఆ హీరో ఎవరు అనేది తెలుస్తుంది.

వీజే చిత్ర ఆత్మహత్య కేసులో కొత్తకోణం. వెలుగులోకి తెలుగు యువహీరో పేరు