చెయ్యని నేరానికి 20 ఏళ్ళు జైలు శిక్ష

119

తప్పుడు తీర్పు జీవితాలను సర్వనాశం చేస్తుంది అనే చెప్పేందుకు నిదర్శనం ఈ కేసు. చెయ్యని నేరానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాడో వ్యక్తి.. చివరకు కోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో ఫిబ్రవరి 28వ తేదీన జైలు నుంచి బయటకు వచ్చాడు.. కేసు వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ లోని లలిత్ పూర్ కు చెందిన 23 ఏళ్ల విష్ణు తివారిని అత్యాచారం కేసులో 2000 సెప్టెంబర్ 1 తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు.. తాను ఏ తప్పు చెయ్యలేదని మొత్తుకున్నా వినలేదు పోలీసులు. ఆ తర్వాత న్యాయస్థానం తివారికి జైలు శిక్ష ఖరారు చేసింది. దాదాపుగా ఈ కేసు 20 ఏళ్ళు నడిచింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని విష్ణు తివారి ఎవరూ నమ్మలేదట.

20 ఏళ్లపాటు సుదీర్ఘమైన పోరాటం చేయడంతో నిరపరాధిగా బయటపడ్డాడు. గతనెల 28 వ తేదీన హైకోర్టు డివిజన్ బెంచ్ విష్ణు తివారీని నిరపరాధిగా పేర్కొంటూ విడుదల చేసింది. 23 సంవత్సరాల వయసులో జైలుకు వెళ్లిన విష్ణు తివారి, 43 ఏళ్ల వయసులో విడుదలయ్యాడు. ఎలాంటి తప్పు చేయలేదని ఎంత మొరపెట్టుకున్నా ఎవరూ వినలేదని, 20 ఏళ్ళు జైల్లో ఉండటం వలన తన కుటుంబాన్ని కోల్పోయానని, తనకు సోదరుడు మినహా ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశాడు. చెయ్యని తప్పుకు తానూ అందరిని కోల్పోయి.. కుటుంబ ప్రేమకు దూరమై.. జీవితంలో సంతోషం అనేదే లేకుండా ఇంతకాలం బ్రతికానని తెలిపారు. తన తమ్ముడు తానే ఉన్నామని. చెయ్యని తప్పుకు శిక్ష వేయడం వలన తన కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని.. ఆ కారణంతోనే వారు మృతి చెందారని తివారి తెలిపారు.

చెయ్యని నేరానికి 20 ఏళ్ళు జైలు శిక్ష