సుందర నగరి విశాఖకు 15 వ ర్యాంక్

152

దేశవ్యాప్తంగా ఉత్తమ నివాస యోగ్య నగరాల జాబితాను కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ‘ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌–2020’ పేరుతో గురువారం విడుదల చేసింది. ఈ జాబితాలో సుందర నగరి విశాఖకు 15వ ర్యాంక్ దక్కింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ క్యాటగిరీలో టాప్‌ 20లో నిలిచిన ఏకైక నగరంగా మెరిసింది. దేశ వ్యాప్తంగా 111 పట్టణాలు పోటీ పాడగా విశాఖ 15వ స్థానం దక్కింది. విజయవాడ 41వ స్థానంలో నిలిచింది. సంస్థాగత, సామాజిక, ఆర్థిక, భౌతిక పరిస్థితులను కొలమానంగా తీసుకొని ఈ ర్యాంకుల్ని ప్రకటించారు. ఇందులో 15 కేటగిరీల్లో 78 సూచీలను విభజించి సర్వే నిర్వహించారు. ఇనిస్టిట్యూషనల్, భౌతిక పరిస్థితుల పరంగానూ విశాఖ నగరం మంచి ర్యాంకు సాధించింది. పది లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల జాబితాలో మొత్తం 100 పాయింట్లకు గాను 57.28 పాయింట్లు సాధించింది. కాగా ఈ ర్యాంక్స్ గతేడాదే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా గురువారం విడుదల చేశారు.

సుందర నగరి విశాఖకు 15 వ ర్యాంక్