సడెన్‌గా టూర్ మధ్యలోనే భారత్‌కు తిరిగొచ్చేసిన కోహ్లీ

83

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటన ముగియకుండానే భారత్‌కు తిరిగి వచ్చేశారు. టెస్ట్‌లు, వన్టేలు, టీ20 సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన కెప్టెన్ కోహ్లీ, ఫస్ట్ టెస్ట్ తర్వాత సడెన్‍‌‌గా భారత్‌కు వచ్చేశారు. కోహ్లీ భార్య హీరోయిన్ అనుష్క శర్మ గర్భవతి కాగా.. ఈ వారంలో అనుష్క శర్మ డెలివరీ డేట్ ఉంది. ఈ క్రమంలోనే కోహ్లీ ఇండియాకు వచ్చేశారు. డెలివరీ సమయంలో అనుష్క శర్మ దగ్గర ఉండాలనే ఉద్దేశంతో కోహ్లీ టూర్ నుంచి వచ్చేసినట్లుగా జట్టు యాజమాన్యం చెబుతుంది..

ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సీరీస్‌లో ఒక టెస్ట్ మాత్రమే ఇప్పటివరకు పూర్తి కాగా.. ఇంకా మూడు టెస్ట్‌లు మిగిలి ఉన్నాయి. ఫస్ట్ టెస్ట్‌లో ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్న భారత్.. ఘోర పరాజయం పాలవగా.. మరో మూడు టెస్టులు ఆడేందుకు సిద్ధం అవుతుంది. రెండవ టెస్టుకు అజింక్యా రహానే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. కోహ్లీ ఇండియాకు బయలుదేరేముందు జట్టు సభ్యులతో భేటీ అయ్యారు.

మొదటి టెస్ట్‌లో జరిగిన తప్పిదాల గురించి ఈ సమయంలో చర్చించారు. మిగిలిన మ్యాచ్‌లలో జాగ్రత్తగా ఆడాలని జట్టు సభ్యులకు కోహ్లీ సూచించారు. రెండో టెస్ట్‌లో భారత్ దిగ్గజ బ్యాట్స్ మేన్స్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు లేకుండా భారత్ మ్యాచ్‌లను ఆడబోతుంది. మూడో టెస్ట్ నుంచి రోహిత్ జట్టులోకి వస్తారు. ఈ నెల 14న ఆస్ట్రేలియా చేరుకున్న రోహిత్.. 14 రోజులపాటు అప్పటి నుంచి హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. జనవరి 3వ తేదీ నుంచి జరగనున్న 3వ టెస్ట్ మ్యాచ్‌కి జట్టులోకి ఎంట్రీ ఇస్తారు రోహిత్ శర్మ.

సడెన్‌గా టూర్ మధ్యలోనే భారత్‌కు తిరిగొచ్చేసిన కోహ్లీ