Virat Kohli daughter name : విరాట్ – అనుష్క శర్మల కూతురు పేరు “వామికా”

179

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ – నటి అనుష్క శర్మ జనవరి 11 న పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే సోమవారం వారి ముద్దుల కూతురుకు నామకరణం చేశారు. విరాట్ఎం అనుష్క శర్మల పేర్లు కలిసేలా వామికా అని పేరు పెట్టారు. ఈ విషయాన్నీ అనుష్క శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భర్త విరాట్, కూతురు వామికా తో కలిసిన దిగిన ఫోటోను షేర్ చేస్తూ పాప పేరును తెలిపారు అనుష్క.

ఎంతో ప్రేమానురాగాలతో నిండిన మా జీవితాల్లో వామికా ఆ సంతోషాలను మరింత రెట్టింపు చేసింది. తన రాక ఎన్నో వెలుగులను తీసుకొచ్చింది. ఆనందం, కన్నీళ్లు, ఆందోళన..ఇలా నిమిషాల వ్యవధిలోనే ఎన్నో భావోద్వేగాలు. కానీ మా హృదయం ఎంతో ప్రేమతో నిండి ఉంది. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, ఆప్యాయతలకు ధన్యవాదాలు’ అంటూ అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపారు. అయితే విరుష్క కూతురును చూడాలని వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చేశారు. అయితే పాప ఫోటులు బయటకు రాకుండా గోప్యాంగ ఉంచారు. ఇక సోమవారం 21 డేస్ సెలెబ్రేషన్స్ లో భాగంగా నామకరణం చేసి వామికా ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Virat Kohli daughter name : విరాట్ – అనుష్క శర్మల కూతురు పేరు “వామికా”

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)