viral: బాహుబలి కిడ్ ఇప్పుడు ఎలా అయిందో చూడండి!

224

viral: జక్కన్న సృజనాత్మక చిత్రం బాహుబలి సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. దేశంలోనే తెలుగు ఇండస్ట్రీ పేరు మార్మ్రోగిపోగా.. దేశ విదేశాల్లో సైతం ఈ సినిమాలో నటించిన నటులకు అభిమానులు ఏర్పడ్డారంటే ఈ సినిమా క్రేజ్ ఎంతగా ఖండాతరాలు దాటిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. కాగా.. ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు సినిమా ఎంత గుర్తు ఉంటుందో.. ఈ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర చనిపోతూ నదిలో మునిగిపోకుండా చేతితో పైకి లేపి ప్రాణాలు కాపాడిన సీన్ అంతే గుర్తు ఉంటుంది. ఆ చిన్నారి గిరిజనుల వద్ద పెరిగి పెద్దవాడై మహిస్మతి సామ్రాజ్యానికి వారసుడవుతాడు.

అయితే, నిజానికి మనకి సినిమాలో బుల్లి ప్రభాస్ గా కనిపించిన ఆ నెలల వయసు గల చిన్నారి తన్వి అనే పాప. ఆ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడండి అంటూ ఎవరో సోషల్ మీడియాలో ఆ ఫోటో పోస్ట్ చేశారు. ఇంకేముంది ఇప్పుడు ఆ ఫోటో తెగ వైరల్ అవుతుండగా బాహుబలి కిడ్, బుల్లి బాహుబలి అంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవిధంగా ఆ పాప ఇప్పుడు సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోతుంది. రేపో మాపో ఏదో ఒక టీవీ షోలో కనిపించడం ఖాయంగా కనిపిస్తుంది.

బాహుబలి కిడ్ ఇప్పుడు ఎలా అయిందో చూడండి!