సర్పంచ్ భర్తకు దేహశుద్ది. ఉతికారేసిన గ్రామస్తులు

221

భునగిరి జిల్లా రామన్నపేట మండలంలోని శోభనాద్రిపురంలో అధికార పార్టీకి చెందిన సర్పంచ్ భర్త ఒళ్ళు చింతపండు చేశారు గ్రామస్తులు. పల్లె ప్రగతి కార్యక్రమంలో చేసిన పనులకు రావలసిన బిల్లు ఇవ్వకపోవడంతో గ్రామస్తులు సర్పంచ్ భర్త శ్రవణ్ ను నిలదీశారు. అయితే ఈ సమయంలో సర్పంచ్ భర్తకు గ్రామస్తులకు మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే సర్పంచ్ భర్త గ్రామస్తులను కులం పేరుతో దూషించారు. దింతో గ్రామస్తులు శ్రవణ్ పై దాడి చేసి పొట్టుపొట్టుగా కొట్టారు. దాడిలో శ్రవణ్ కు గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రామన్నపేట పోలీసులు విచారణ చేపట్టారు.

సర్పంచ్ భర్తకు దేహశుద్ది. ఉతికారేసిన గ్రామస్తులు