మృతురాలికి ఫించన్ ఇచ్చిన వాలంటీర్.. విచారణకు ఆదేశించిన అధికారులు

199

ఓ వాలంటీర్ మృతురాలి వేలిముద్రలు తీసుకోని ఫించన్ ఇచ్చిన వ్యవహారం ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఓ వ్యక్తి మృతి చెందిన తర్వాత ఫించన్ ఇవ్వడం చూసి అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వ్యవహారం విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గుర్ల మండలంలోని గుర్ల గ్రామంలో ఎర్ర నారాయణమ్మ అనే వృద్ధురాలు సోమవారం ఉదయం మరణించారు. ప్రతి నెల ఒకటోతేదీ ప్రభుత్వం వృద్దులు, వికలాంగులకు ఫించన్ పంపిణి చేస్తుంది.

ఈ నేపథ్యంలోనే ఫింగర్ ప్రింగ్ మెషిన్ తీసుకోని ఆ వార్డు వాలంటీర్ ఎర్ర నారాయణమ్మ ఇంటికి వచ్చాడు. అప్పటికే ఆమె మరణించగా మృతదేహాన్ని ఇంటి బయట ఉంచి కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అప్పటికే ఆమెకు ఫించన్ మంజూరు కావడంతో వాలంటీర్ త్రినాథ్ వేలి ముద్ర వేయిస్తే పింఛన్ ఇస్తానని తెలిపాడు. దింతో కుటుంబ సభ్యులు వృద్ధురాలి వేలి ముద్రలు వేయించేందుకు ఒకే చెప్పారు. వేలి ముద్ర తీసుకోని కుటుంబ సభ్యులకు ఫించన్ డబ్బులు ఇచ్చాడు త్రినాథ్.. ఇదే సమయంలో నారాయణమ్మ మృతుదేహం వద్ద ఓ సెల్ఫీ దిగాడు.

ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం అధికారుల దృష్టికి వెళ్ళింది. ఈ వ్యవహారంపై విచారణ చేయాల్సిందిగా ఎంపీడీవో కళ్యాణిని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనిపై విచారణ చేపట్టిన ఆమె.. నారాయణమ్మ మృతి చెందక ముందే ఫించన్ అందించినట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం మృతి చెందిన వారికి ప్రభుత్వ పథకాలను అందించకూడదు. ఈ నేపథ్యంలోనే వాలంటీర్ వ్యవహారం చర్చకు దారితీసింది.

మృతురాలికి ఫించన్ ఇచ్చిన వాలంటీర్.. విచారణకు ఆదేశించిన అధికారులు