టీఆర్ఎస్‌కు షాకిచ్చిన కార్పోరేటర్… కన్నీరుపెట్టుకుంటూ వెళ్ళిపోయిన విజయారెడ్డి

448

తీవ్ర ఉత్కంఠ రేపిన మేయర్ ఎన్నిక పూర్తైంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ అభ్యర్థులే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చేసుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు మేయర్ ఓటింగ్ సమయంలోనే బయటకు వచ్చాయి. బీజేపీ మాత్రం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్యాలయానికి వెళ్లే సమయంలో తమ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ప్రకటించింది. టీఆర్ఎస్ మాత్రం బయటకు చెప్పలేదు. సీల్డ్ కవర్లో కార్యాలయానికి పేర్లను పంపింది అధిష్టానం. ఇక ఎంఐఎం మద్దతుతో అలవోకగా మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. బంజారాహిల్స్ కార్పొరేటర్ విజయలక్ష్మి కార్పొరేటర్ గా గెలుపొందగా, తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత రెడ్డి డిప్యూటీ మేయర్ గా గెలుపొందారు.

మేయర్ ఎన్నిక సమయంలోనే టీఆర్ఎస్ లో అసమ్మతి సెగలు లేచాయి. ఖైరతాబాద్ కార్పొరేటర్ గా పోటీ చేసి విజయం సాధించిన విజయ రెడ్డి.. కన్నీరు పెట్టుకుంటూ కార్యాలయం నుంచి వెళ్ళిపోయింది. కాగా మొదటి నుంచి మేయర్ పదవి విజయరెడ్డికి ఇస్తారని వార్తలు వచ్చాయి. ఎన్నికల సమయం నుంచి విజయారెడ్డి పేరే అధికంగా వినిపించింది. ఎన్నికల సమయంలో కూడా బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకొని పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించింది. ఇక టీఆర్ఎస్ పంపిన షీల్డ్ కవర్లో కూడా విజయ రెడ్డి పేరే ఉంటుందని అందరు భావించారు. కానీ అనూహ్యాంగా విజయలక్ష్మి పేరు బయటకు రావడంతో ఒక్కసారిగా ఆవేదనకు గురైంది. మేయర్ ఎన్నికలో పాల్గొనకుండానే కౌన్సిల్ హాల్ నుంచి ఆమె వెళ్లిపోయారు. టీఆర్ఎస్ నేతలు ఆమెను ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది. విజయారెడ్డికి మేయర్ పదవి దక్కకపోవడంతో ఆమె మద్దతుదారులు,పీజేఆర్ అభిమానులు టీఆర్ఎస్ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. కాగా విజయరెడ్డి మాజీ ఎమ్మెల్యే దివంగత నేత పీ. జనార్దన్ రెడ్డి కూతురు.

అయితే డిప్యూటీ మేయర్ పదవిని మాత్రం ఊహించని వ్యక్తికి ఇచ్చారు. శ్రీలత రెడ్డి తొలిసారి విజయం సాధించారు. విజయరెడ్డికి డిప్యూటీ మేయర్ పదవి కూడా కేటాయించకపోవడంతో ఆమె కన్నీరు పెట్టుకుంటూ వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు.

టీఆర్ఎస్‌కు షాకిచ్చిన కార్పోరేటర్… కన్నీరుపెట్టుకుంటూ వెళ్ళిపోయిన విజయారెడ్డి