కేసీఆర్ నా కంటే గొప్ప నటుడు – విజయశాంతి

107

లేడి అమితాబ్ విజయశాంతి తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ఆమె నాంపల్లి బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల రక్తం కూడు తింటున్నారని వ్యాఖ్యానించారు. అమరవీరుల శవాలపై కూర్చుని కేసీఆర్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పతనం మొదలైంది..

టీఆర్ఎస్ కనుమరుగవటం ఖాయమని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌తో కాంగ్రెస్‌ మ్యాచ్ ఫిక్సింగ్.. భవిష్యత్ బీజేపీదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. రాఖీ కట్టిన చెల్లెళ్లకు లక్ష ఇవ్వలేని కేసీఆర్‌కు లక్ష కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్…తన కంటే గొప్ప నటుడని ఎద్దేవ చేశారు. కేసీఆర్‌ స్వార్థంతో తల్లి తెలంగాణ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకున్నారని దుయ్యబట్టారు.

కేసీఆర్ నా కంటే గొప్ప నటుడు – విజయశాంతి