ఖర్చులకు డబ్బులు లేక అల్లాడుతున్న విజయ్ మాల్యా

109

కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్ లో ఉంటున్న విషయం తెలిసిందే. ఇండియన్ బ్యాంకులకు వేలకోట్ల రూపాయాలు ఎగవేసిన మాల్యా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడంట. దివాళా చర్యల్లో భాగంగా తన ఆస్తులను జప్తు చేశారు. దింతో తన ఖర్చులకు కోర్టు వ్యవహారాలకు డబ్బులు లేక నిధుల సమస్య ఎదురుకుంటున్నారంట మాల్యా.

ఈ మేరకు కొద్దిగా నిధులు పొందేందుకు అనుమతించాలని బ్రిటన్ హైకోర్టును కోరగా ఖర్చులకోసం 2.3 కోట్లు తీసుకునేందుకు న్యాయస్థానం ఓకే చెప్పింది. ఇక వాటితో కొన్ని రోజులు గడపగలనని వివరించారు. కాగా మాల్యాకు చెందిన 13 వేల కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. దింతో వాటి నుంచి వచ్చే లాభాలను అనుభవించలేకపోతున్నాడు మాల్యా

 

ఖర్చులకు డబ్బులు లేక అల్లాడుతున్న విజయ్ మాల్యా