నిండిపోయిన వేములవాడ రాజన్న దేవాలయ హుండీలు..

338

కరోనా కాలంలో భక్తులు మొక్కులు తీర్చుకోడానికి వెసులుబాటు వెకపోయింది. ఇక ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండటంతో దేవాలయాలకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు సాధారణ రోజుల్లో కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇక వేములవాడ రాజన్న దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో దేవాలయంలో హుండీలు నిండిపోయాయి. దింతో తమ మొక్కులు ఎక్కడ చెల్లించుకోవాలో తెలియక భక్తులు తర్జన భర్జన పడుతున్నారు.

అయితే భక్తులు సమర్పిస్తున్న కానుకల్లో నోట్లకంటే చిల్లర నాణేలు అధికంగా ఉంటున్నాయి. దింతో హుండీలు వెంటనే నిండిపోతున్నాయి. ముడుపులు కట్టిన చిల్లర పైసలు హుండీల్లో వేస్తుండటంతో కొద్దిరోజులకే నిండిపోతున్నాయి. మరోవైపు బ్యాంకులు ఆ చిల్లర డబ్బు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పటికే రాజన్న ఆలయంలో పెద్ద మొత్తంలో చిల్లర డబ్బును నిల్వ చేశారు. కొద్దీ రోజులుగా హుండీలు లెక్కించడం లేదు. దింతో పైనించి కానుకలు వేసినా లోపలి వెళ్లడం లేదు. ఇక ఏటా రాజన్నకు కానుకల రూపంలో 18 కోట్ల రూపాయలు వస్తాయి. అందులో 2 కోట్ల రూపాయల వరకు చిల్లర నాణేలు వస్తున్నాయి. చిల్లర కాయిన్స్‌తో ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు ఆలయ అహఁధికారులు. దీనిపై త్వరలోనే పరిష్కారం కనుగొంటామని చెబుతున్నారు.

ఇక తిరుపతిలో కూడా ఇదే పరిస్థితి చిల్లర నాణేలు అధిక మొత్తంలో వస్తుండటంతో వాటిని నిల్వ చేయడం ఆలయ అధికారులకు ఇబ్బందిగా మారింది. అయితే గతేడాది నాణేలు తీసుకునేందుకు బ్యాంకులు అంగీకరించలేదు. టీటీడీ అధికారులు బ్యాంకులతో చర్చించి నాణేలను జమ చేసుకునేలా చేశారు. అయితే నాణేలు భద్రపరచడం బ్యాంకులకు కూడా ఇబ్బందిగా మారుతుంది. ఇంటికోసం ప్రత్యేక గదులను తీసుకోని భద్రపరచాల్సి వస్తుంది. వాటికీ సెక్యూరిటీ పెట్టడం కూడా బ్యాంకుకు వ్వయం అవుతుంది. ఈ నేపథ్యంలోనే గతేడాది తాము చిల్లర నాణేలు తీసుకోమని బ్యాంకులు ప్రకటించాయి. దీనిపై చర్చలు జరిపిన అధికారులు సమస్య పరిష్కరించారు.

నిండిపోయిన వేములవాడ రాజన్న దేవాలయ హుండీలు..