Chennamaneni Ramesh : వేములవాడ ఎమ్మెల్యే జర్మనీ పౌరుడు..

152

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నమనేని రమేష్ కు జర్మనీ పౌరసత్వం ఉందని కేంద్ర హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. కాగా గత కొంత కాలంగా రమేష్ పౌరసత్వంపై చర్చ జరుగుతుంది. దీనిపై గతంలో విచారణ చేపట్టిన హైకోర్టు కేంద్ర హోంశాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసుకు సంబందించిన అఫిడవిట్ ను కేంద్ర హోంశాఖ దాఖలు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది కోర్టు.

కాగా గురువారం కేంద్రహోంశాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. అతడికి జర్మనీ పౌరసత్వం ఉందని తెలిపింది. జర్మనీ పౌరసత్వం ఉండి భారత చట్ట సభల్లో పదేళ్ళపాటు ఉండటాన్ని తీవ్రమైన అంశంగా పరిగణించాలని కోర్టును పిటిషినర్ అది శ్రీనివాస్ కోరారు. ఇదిలా ఉంటే వీలైనంత త్వరగా కేసును సంబంధిత బెంచ్ ముందుంచాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. అనంతరం కేసును వాయిదా వేసింది. రమేష్‌ జర్మన్ పౌరుడేనని కేంద్రం దృవీకరించిన నేపథ్యంలో వేములవాడలో రాజకీయాలు వేడెక్కాయి.

అయితే ఓ వ్యక్తిని 7 ఏళ్లపాటు ఈ దేశ పౌరుడా కదా అనేది గుర్తించలేకపోయారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ పౌరసత్వం ఉన్న వ్యక్తిని ఇంతకాలం చట్టసభల్లో కూర్చోబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇది రుజువైతే ఎమ్మెల్యే అనర్హుడిగా ప్రకటించడంతోపాటు, భారత చట్టాలకు అనుగుణంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

Chennamaneni Ramesh : వేములవాడ ఎమ్మెల్యే జర్మనీ పౌరుడు..