మర్డర్ సినిమా విడుదలకు డేట్ ఫిక్స్, 22న మిర్యాలగూడలో వర్మ ప్రెస్ మీట్

191

సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వచ్చిన మర్డర్ సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమా నుంచి రెండో ట్రైలర్ గురువారం విడుదలైంది. ఇక మర్డర్‌ సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి రాంగోపాల్‌ వర్మకు అన్ని అడ్డంకులే ఎదురయ్యాయి. చివరికి అన్ని సమస్యలను దాటుకొని విడుదలకు లీగల్‌గా గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది.

ఇక ఈ నేపథ్యంలోనే సినిమా గురించి వర్మ మాట్లాడుతూ 24 న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. థియేటర్లలో సినిమా విడుదల అవుతుందని, మిర్యాలగూడలో కూడా విడుదల చేస్తామని వివరించారు. కాగా ఈ సినిమా 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్న పెరుమాళ్ళ ప్రణయ్ అనే యువకుడి హత్యకు సంబందించిన చిత్రం.. ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

కాగా ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం ఈ నెల 22 న మిర్యాలగూడలో ప్రెస్ మీట్ పెడతామని వర్మ తెలిపారు. మిర్యాలగూడలో ప్రెస్ మీట్ పెట్టేందుకు కొన్ని కారణాలున్నాయని తెలిపారు. కానీ వాటిని చెప్పడానికి వీలు కాదని తెలిపారు. ఇక్కడ పెడితేనే కరెక్ట్ ఉంటుందని భావిస్తున్నాము. ఈ సినిమా పిల్లలకు తల్లిదండ్రులకు జరిగే నిరంతర యుద్ధం. వారి ఇష్టాలను కాదన్నపుడు చాలామందికి ఎం నష్టం జరుగుతుందనేది ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది’ అని అన్నారు.

మర్డర్ సినిమా విడుదలకు డేట్ ఫిక్స్, 22న మిర్యాలగూడలో వర్మ ప్రెస్ మీట్