ఎన్నికల కమిషనర్ కు లేఖ రాసిన వర్ల రామయ్య

243

ఆంధ్ర ప్రదేశ్ పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 5 న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య SEC కి లేఖ రాశారు. ఎన్నికలను నిస్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జరిగిన విధంగా అవకతవకలు జరగకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. 2020 మార్చిలో స్థానిక ఎన్నికల నామినేషన్ సమయంలో అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవరించారని వారు తెలిపారు. అధికార పార్టీకి ఒక ఓటర్ లిస్ట్, ప్రతిపక్షాలకు మరో ఓటర్ లిస్ట్ ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు అటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని వివరించారు.

పంచాయితీ ఎన్నికల్లో వాలంటీర్లకు విధులు అదే గ్రామంలో ఇవ్వకుండా వేరేచోట్ల వెయ్యాలని కోరారు. వాలంటీర్లు ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల అధికారులకు సిబ్బందికి వారు పనిచేస్తున్న రెవెన్యూ డివిజన్ లో కాకుండా వేరే చోట విధులు వెయ్యాలని కోరారు. ఎన్నికల భద్రతకు కేంద్ర బలగాలను దించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీ సర్వేలెన్స్ ఏర్పాటు చెయ్యాలని అన్నారు. ఎన్నికల్లో పాల్గొనే వారికి కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని SEC కి రాసిన లేఖలో వార్ల రామయ్య పేర్కొన్నారు.

ఎన్నికల కమిషనర్ కు లేఖ రాసిన వర్ల రామయ్య