Hyderabad :- వనస్థలిపురంలో రోడ్డు ప్రమాదం

250

నగరంలో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. అర్ధరాత్రి సమయంలోనే రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ప్రమాదానికి కారణమవుతున్న వారిలో యువతే ఎక్కువగా ఉన్నారు. ఇక తాజాగా వనస్థలిపురం పోలీస్ లిమిట్స్ లో కారు బీభత్సం సృష్టించింది. పీకలదాకా మద్యం తాగిన యువకులు సాగర్ రోడ్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్తున్న సమయంలో అదుపుతప్పిన కారు ట్రాఫిక్ సిగ్నల్ ను ఢీకొని డివైడర్ మీదకు ఎక్కింది.

వనస్థలిపురంలో కారు బీభత్సం

కారులో మొత్తం ముగ్గురు యువకులు ఉండగా వీరిలో ఒకరు మృతి చెందారు. మరో యువకుడు పారిపోయాడు. కారును నడిపిన గౌతమ్ అనే యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. ఇక మృతి చెందిన యువకుడి పేరు సందీప్ అని పోలీసులు నిర్దారించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు.

వనస్థలిపురంలో కారు బీభత్సం

Hyderabad :- వనస్థలిపురంలో రోడ్డు ప్రమాదం