వామన్ రావుపై దాడి చేస్తారని ముందే గుర్తించిన తండ్రి కిషన్ రావు

471

బుధవారం పెద్దపల్లి జిల్లాలో జరిగిన న్యాయవాదుల హత్య ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. లాయర్ దంపతులపై దాడి జరిగే అవకాశం ఉన్నట్లు వామన్ రావు తండ్రి ముందుగానే గుర్తించారు. బుధవారం మంథని కోర్టుకు వామన్ రావుతో కలిసి తండ్రి కిషన్ రావు వెళ్లారు. అక్కడ పని పూర్తి కాగానే వామన్ రావు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళాడు.అటు నుంచి భార్యతో కలిసి హైదరాబాద్ బయలుదేరారు. అయితే వీరిపై ఎటాక్ జరిగే అవకాశం ఉన్నట్లు వామన్ రావు తండ్రి కిషన్ రావు ముందే గుర్తించారు. కోర్టుకు వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులు వామన్ రావు గురించి మాట్లాడుతుండగా పక్కన ఉన్నవారు విని కిషన్ రావుకు తెలిపారు.

దాడి చేసే అవకాశం ఉన్నట్లు కిషన్ రావు, వామన్ రావుకు ఫోన్ చేసి తెలిపాడు. అయితే ఆయన ఈ విషయాన్నీ చాలా లైట్ గా తీసుకోవడంతో ఈ దారుణం జరిగింది. నాపై ఎవరు దాడి చేస్తారు.. మీరు భయపడకండి అంటూ వామన్ రావు తన తండ్రి కిషన్ రావుతో అన్నాడు. ఆ మాట అన్న 10 నిమిషాల వ్యవధిలో వామన్ రావు హత్యకు గురైనట్లు కారు డ్రైవర్ ఫోన్ చేసి చెప్పినట్లు కిషన్ రావు మీడియాకు తెలిపారు. కోడలిని కూడా హత్య చేశారని డ్రైవర్ తెలిపాడదని.. వామన్ రావు తన మాట విని ఉంటే ప్రాణాలతో ఉండేవారని తెలిపారు.

ఈ హత్య వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని వివరించారు. టీఆర్ఎస్ నేత మధుపై వామన్ రావు కోర్టులో కేసు వేశారని. టీఆర్ఎస్ అవినీతిని ప్రశ్నిస్తూ కోర్టులో అనేక కేసులు వేశారని వివరించారు. కేసుల్లో బయటపడలేకే తన కొడుకు కోడలిని హత్య చేశారని వివరించారు కిషన్ రావు. తన కొడుకును ఎలాగైతే నరికారో వారిని కూడా అలానే నరకాలని కోరారు. ఈ హత్యలో ఎంతటి వారు ఉన్న ఒదిలిపెట్టమని పోలీస్ కమిషనర్ హామీ ఇచ్చినట్లు కిషన్ రావు వివరించారు. కాగా ఈ హత్యకేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. వీరిని ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తారు.

అయితే ఈ హత్యలో పోలీసుల ప్రమేయం కూడా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.. రాయగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్లాన్ వేసి హత్య చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ హత్యకు టీఆర్ఎస్ నేత పుట్ట మధు అల్లుడు, బిట్టు శ్రీను ఆయుధాలు సమకూర్చినట్లు పోలీసులు గుర్తించారు. రాయగిరి పోలీసులు హత్య కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పోలీసుల సహకారం అందటంతోనే ఇక్కడ హత్యచేసినట్లుగా తెలుస్తుంది.

ఇక రాయగిరి ఎస్ఐ తీరుపై కూడా అనుమానాలు వ్యక్తమమవుతున్నాయి. నిందితులకు బిట్టు శ్రీను సహకరించడం వెనక ఆంతర్యం ఏంటనే కోణంలో విచారణ సాగుతుంది. ఇక ఉన్నతాధికారుల ద్రుష్టి మొత్తం రాయగిరి పోలీస్ స్టేషన్ పై ఉంది. జెడ్పీ చైర్మన్ పుట్ట మధు పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పుట్ట మధుకు తెలియకుండానే ఈ దారుణం జరిగిందా అంటూ ప్రశిస్తున్నారు స్థానికులు, కుటుంబ సభ్యులు.

వామన్ రావుపై దాడి చేస్తారని ముందే గుర్తించిన తండ్రి కిషన్ రావు