వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ పదవి నుంచి రేవతి తొలగింపు?

83

ఏపీ వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ రేవతి గురువారం గుంటూరు జిల్లా ఖాజా టోల్ గేట్ వద్ద వీరంగం సృష్టించారు. టోల్ చెల్లించమని అడిగిన సిబ్బందిని పరుషపదజాలంతో దూషించారు. తాను వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ అని, తనను టోల్ చెల్లించమంటారా అంటూ హంగామా చేశారు. బారికేట్లను తీసి పక్కకు వేశారు. అంతే కాదు టోల్ సిబ్బందిపై చెయ్యి చేసుకున్నారు.

కాగా దీన్నంతటిని ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దింతో విషయం పార్టీ పెద్దలకు చేరింది .. కాగా ఆమెకు సీఎంఓ నుంచి కాల్ వచ్చినట్లు సమాచారం. ఆమె తీరుపై జగన్ సీరియస్ అయినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే రేవతిని తక్షణమే పదవినుంచి తొలగించే ఆస్కారం ఉన్నట్లుగా తెలుస్తుంది.