ఆ దేవత కన్నెర్ర.. ఆలయాన్ని కూల్చడం వల్లే జల విలయం..!

257

ఉత్తరాఖండ్,, పచ్చని చెట్లు, కొండలు లోయలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడో ఎన్నో పుణ్యక్షేతాలు ఉన్నాయి. జోతిర్లింగం కొలువై ఉన్న ప్రదేశం. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ప్రతి ఏడాది కోటిమందికి పైగా సందర్శకులు వస్తుంటారు. ఇక ఇక్కడ అనేకమంది సాధువులు ముక్తిపొందేందుకు వస్తుంటారు. ఇక్కడే ధ్యానం చేస్తూ జీవితం గడుపుతారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎన్నో మఠాలు, పీఠాలు ఉన్నాయి. గంగా, అలకనంద, భగీరధి వంటి నదులు, హిమనీ నాదాలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఉత్తినే నదులే ఉత్తర భారతాన్ని సగానికిపైగా సస్యశామలం చేస్తున్నాయి.

ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే ఈ ప్రాంతంలో ప్రమాదాలు కూడా ఎక్కువే.. కొండచరియలు విరిగిపడటం. హిమపాతాలు కూలడం, వర్షాల సమయంలో నదులు ఉదృతంగా ప్రవహించడం వంటివి జరుగుతుంటాయి. కొండలు గుట్టలతో ఉండే ఈ రాష్ట్రంలో నదులు అత్యంత వేంగంగా ప్రవహిస్తాయి. కొన్ని సార్లు నదిపక్కన ఉండే కొండలు విరిగి నదిలో పడి అమాంతం ప్రవాహాన్ని పెంచుతాయి. ఇక తాజాగా చమోలి జిల్లాలో జరిగిన ప్రమాదం కూడా ఇటువంటిదే.. నందాదేవి పర్వతంలోని మంచు కొండ విరిగి ధౌలీగంగా నదిలో పడింది. దింతో ఒక్కసారిగా నది ఉగ్రరూపం దాల్చింది.

దింతో నదికి కింద ఉన్న తపోవనం పవర్ ప్లాంట్ నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. 150 మంది సిబ్బంది పవర్ ప్లాంట్ టన్నెల్ లో చిక్కుకుపోయారు. వీరిలో కొందరిని ఐటీబీపీ అధికారులు ప్రాణాలతో బయటకు తీశారు. మిగతా వారు మృతి చెందినట్లుగా ప్రాధమికంగా నిర్దారించారు. ఇక ఇప్పటివరకు 30 మృతదేహాలను వెలికి తీశారు.

అయితే ఈ ప్రమాదానికి ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతున్నారు. అధికారులు నందాదేవి పర్వతంలో కొద్దిభాగం విరిగిపడటం కారణంగానే ఈ ప్రమాదం సంభవించింది అంటున్నారు. అయితే ఈ ప్రమాదంపై స్థానిక రైనీ గ్రామస్తులు పలు ఆసక్తి కర విషయాలను వెల్లడించారు. వారు చెబుతున్న దాని ప్రకారం, రుద్రప్రయాగ్ జిల్లాలోని శ్రీనగర్ సమీపంలో అప్పటి ప్రభుత్వం హైడల్ పవర్ ప్రాజెక్ట్ చేపట్టాలని తలపెట్టింది. అయితే, ప్రాజెక్టుకు అడ్డుగా ఉన్న ధారి దేవి మందిరాన్ని అక్కడి నుంచి వేరే చోటుకు తరలించాలని అధికారులు నిశ్చయించారు.

ఈ ధారి దేవి చార్ ధామ్ తీర్థయాత్రకు రక్షకురాలిగా ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే ఈ దేవాలయాన్ని అక్కడే ఉంచాలని అప్పట్లో స్థానికులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వినతులు ఇచ్చారు. అయినా, ప్రాజెక్టుకు అడ్డుగా ఉందన్న కారణంతో ఆలయాన్ని వేరే చోటుకు మార్చారు. ఆ దేవాలయాన్ని నది ఒడ్డున నిర్మించారు. నది ఒడ్డున భక్తులు వెళ్లేందుకు చాలా ఇబ్బందిగా ఉండేది. అక్కడికి వెళ్లాలంటే రాళ్లపై నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. దింతో గతేడాది గ్రామస్తులు రోడ్డు పక్కన ప్రధాన ఆలయానికి ప్రతీకగా రైనీ గ్రామస్తులు ఒక చిన్న ఆలయాన్ని నిర్మించుకున్నారు. తద్వారా వృద్ధులతో సహా ప్రతి ఒక్కరూ ఆలయాన్ని సులువుగా సందర్శిస్తున్నారు.

అయితే, గత సంవత్సరం గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న ఆలయాన్ని కూడా పవర్ ప్లాంట్ అధికారులు తొలగించారు. వారు దేవాలయాన్ని వేరే ప్రదేశానికి మారుస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు దేవాలయాన్ని మార్చలేదు. అధికారులు దేవాలయ నిర్మాణాన్ని మరుగున పడేయటంతోనే ఇప్పడు ఈ ప్రళయం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ఇది దేవత కోపాన్ని స్పష్టంగా సూచిస్తుందని వారు అంటున్నారు. దీనిపై రైనీ గ్రామానికి చెందిన బినా రానే అనే వ్యక్తి మాట్లాడుతూ అధికారులు ఆలయాన్ని తొలగించిన రోజే, వారు దేవత కోపాన్ని ఆహ్వానించారు.

దేవత శాపం వల్లే ఈ విషాదం జరిగిందని నమ్ముతున్నాం. అని అన్నాడు. బినా రానే చేసిన వ్యాఖ్యలను గ్రామస్తులు సమర్థిస్తున్నారు. దారి దేవిని అక్కడి నుంచి తొలగించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, దారి దేవి ఎంతో శక్తివంతురాలని చెబుతన్నారు. నిరాటంకంగా పూజలు అందుకున్న అమ్మవారిని దూపదీపా నైవేద్యాలకు నోచుకోకుండా చేశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దేవాలయాన్ని నిర్మించి అమ్మను శాంతింప చెయ్యాలని కోరుతున్నారు. అయితే కొందరు మాత్రం గ్రామస్తుల వాదనను కొట్టిపడేస్తున్నారు. వాతావరణంలో వేడి కారణంగా మంచు చరియ కూలిపడిందని అంటున్నారు.

ఆ దేవత కన్నెర్ర.. ఆలయాన్ని కూల్చడం వల్లే జల విలయం..!