చమోలిలో 39 మంది కోసం టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ

186

ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలిలోని తపోవన్ వద్ద జరిగిన ప్రమాదంలో నాల్గవ రోజు కూడా.. ఎన్‌టిపిసి సొరంగంలో చిక్కుకున్న 39 మంది కార్మికులను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుమారు రెండున్నర కిలోమీటర్ల పొడవున్న సొరంగం చాలావరకు శిధిలాలతో నిండి ఉంది. దాంతో ఆర్మీ, ఐటిబిపి, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ దళాలు రక్షణలో నిమగ్నమై ఉన్నాయి. అయినప్పటికీ, ఇప్పటివరకు 120 మీటర్లు మాత్రమే శుభ్రం చేశారు. కాగా 4 రోజులుగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు అల్పోష్ణస్థితి (తక్కువ శరీర ఉష్ణోగ్రత) మరియు ఆక్సిజన్ స్థాయిలు పడిపోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఇక ఇప్పటివరకు 32 మృతదేహాలు లభించాయి.