గ్యాస్‌ ట్యాంకర్‌ను ఢీ కొట్టిన బస్సు.. 8మంది దుర్మరణం

80

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం సంభల్‌ జిల్లాలో బస్సు అదుపు తప్పి గ్యాస్‌ ట్యాంకర్‌ను ఢీ కొట్టింది.. దాంతో ఎనిమిది మంది దుర్మరణం చెందగా, మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సంభల్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది దాకా ఉన్నట్టు తెలుస్తోంది.